Leading News Portal in Telugu

Video Feature On X: ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్‌.. ఫోన్‌ నంబర్‌ అవసరం లేదు!


Audio, Video Calling on X Soon: ఎక్స్‌ (ట్విట్టర్)ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశాక ఎన్నో మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఎక్స్‌లో కాల్‌ చేసుకునే సదుపాయం ఉంటుందని ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌ సహా పీసీలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ చేయడానికి ఫోన్‌ నంబర్‌ అవసరం లేదని ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్‌ బుక్‌కు ఎక్స్‌ వేదిక కానుందని, ఇందులో ఫీచర్స్ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ‘వీడియో, ఆడియో కాల్‌లు ఎక్స్‌లో త్వరలో వస్తున్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీలో ఈ సదుపాయం ఉంటుంది. ఫోన్‌ నంబర్‌ అవసరం లేదు. ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్‌ బుక్‌కు ఎక్స్‌ వేదిక’ అని మస్క్‌ ట్వీట్ చేశారు.