Leading News Portal in Telugu

IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ!



Pakistan Team

Shaheen Afridi injury scare ahead of IND vs PAK Clash: ఆసియా కప్‌ 2023లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. బుధవారం ముల్తాన్‌ వేదికగా పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఆసియా కప్‌ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బోణి కొట్టిన పాకిస్తాన్‌కు భారత్‌తో మ్యాచ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్ స్టార్‌ పేసర్‌​ షాహీన్‌ షా అఫ్రిది గాయం కారణంగా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్‌ అఫ్రిది పాత గాయం మళ్లీ తిరగబెట్టింది. మైదానంలో మోకాలి నొప్పితో అతడు బాధపడ్డాడు. అదే సమయంలో ఎండ తీవ్రత కూడా ఎక్కవగా ఉండడంతో అఫ్రిది ఇబ్బందిపడ్డాడు. ఫిజియో సలహా మేరకు అతడు మైదానాన్ని వీడాడు. నేపాల్‌ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అఫ్రిది.. 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో అఫ్రిది కోలుకుంటాడని పాక్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది.

Also Read: Madhapur Drugs: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్‌.. నిర్మాత వెంకట్ ఫోన్ మిస్సింగ్..!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (151; 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (109 నాటౌట్‌; 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. 343 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నేపాల్‌ 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. షాదాబ్‌ ఖాన్‌ (4/27) నేపాల్‌ నడ్డివిరిచాడు.