Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విజయాల కోసం కష్టపడుతున్నాడు. మహేష్ బావ గా పేరు ఉన్నా కూడా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి మొదటినుంచి ఆరాటపడుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇక ఫిట్ నెస్ గురించి మాట్లాడుకోవాలంటే.. టాలీవుడ్ లో సుధీర్ మొదటివరుస లో ఉంటాడు. ఆ బాడీని ఎలా కావాలంటే అలా మలచడంలో సిద్ధహస్తుడు అని చెప్పాలి. ఇక ఇవన్నీ ఇలా ఉంటే.. తాజాగా సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సుధీర్ హీరోగా కాకుండా ఇప్పుడు డైరెక్టర్ అయితే .. అందులో హీరో ఎవరు.. ? ఎలాంటి కథను.. మీరు ఎంచుకుంటారు.. ? అన్న ప్రశ్నకు.. సుధీర్ తడుముకోకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం విశేషం.
Rakshit Shetty: ఖుషీ రిలీజ్ రోజే హైదరాబాద్ లో కూడా రష్మిక మాజీ ప్రియుడి సినిమా
” నేను డైరెక్టర్ అయితే .. పవన్ తో సినిమా చేస్తా .. అందులో పవన్ ను సీఎం చేస్తా.. నా సినిమాలో పవన్ ను సీఎం గా చూడాలనుకుంటున్నాను” అనో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. డైరెక్టర్ గా మారితే.. మహేష్ తో సినిమా చేస్తా అనకుండా పవన్ పేరు చెప్పడం పవన్ ఫ్యాన్స్ ను సంతోషానికి గురిచేస్తోంది. ఇది నిజం అవుతుందా..? లేదా.. ? అని పక్కన పెడితే.. పవన్ ను సీఎం అనడంతో ఫ్యాన్స్.. వచ్చే ఏడాది నిజంగానే సీఎం అవుతాడు.. అప్పుడు సినిమా తీయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.