South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశంలో ప్రధాన నగరమైన జోహెన్నెస్‌బర్గ్ లో జరిగిన ఈ ప్రమాదంలో 52 మంది దుర్మరణం పాలయ్యారు. నగరంలోని 5 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 52 మంది మరణిస్తే, 43 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. అయితే ప్రమాదానికి కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్ ప్రాంతంలో ఉంది. ఇప్పటి వరకు 52 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములాడ్జీ తెలిపారు. అయితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.