Leading News Portal in Telugu

Suicide Bomb Blast: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 8 మంది సైనికులు దుర్మరణం


Suicide Bomb Blast: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో దాదాపు ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించగా.. మరో 17 మంది గాయపడ్డారు. ఈ మేరకు పాకిస్తాన్ టెలిగ్రాఫ్ గురువారం నివేదించింది. మాలి ఖేల్ ప్రాంతంలో భద్రతా దళాల కాన్వాయ్‌పై మోటర్‌బైక్‌పై వచ్చిన ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. జులై 30న ఒక రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడును ప్రేరేపించడంతో కనీసం 54 మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. 400 మందికి పైగా JUI-F సభ్యులు, మద్దతుదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.