AP CM Jagan London Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి సీఎం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పాటు కుటుంబంతో కలిసి యూకేలో ఉన్న తన కూతుళ్లను చూసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం.
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో యూకే పర్యటనకు వెళ్లాలని సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు.ఈ మేరకు కోర్టులో అనుమతి కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుండి 12వ తేదీ వరకు జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది. యూకేలో ఉన్న తన కూతుళ్లను చూసేందుకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టును అనుమతిని కోరారు. కుటుంబ సమేతంగా యూకే పర్యటనకు వెళ్తున్నట్టుగా కోర్టుకు ఆయన తెలిపారు.యూకే వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి ఇవ్వడంతో సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారైంది.