Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత గీతగోవిందంతో తెలుగులో స్థిరపడిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ.. పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. పుష్ప సినిమాతో రష్మికకు ఎంత మంచి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీవల్లీ అంటూ దేశం మొత్తం పిలుస్తుంటే.. ముద్దుగుమ్మ మురిసిపోయింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా రానున్న పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇది కాకుండా రష్మిక .. యానిమల్ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో రష్మిక నటించడంతో అమ్మడు ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Niharika Konidela: ఈ ఏడాది.. వీరందరూ నాకు చాలా స్పెషల్
ఇక ఈ భామ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేస్తోంది. తాజాగా ఈ చిన్నది కొత్త లుక్ లో కనిపించి అభిమానులను షాక్ కు గురిచేసింది. చక్కగా ముక్కుకు ముక్కెర పెట్టి.. క్యూట్ సెల్ఫీలు పోస్ట్ చేసింది. ఇక ఈ లుక్ లో ముద్దుగుమ్మ ఎంతో అందంగా ఉంది. ముక్కెరతో రష్మిక ఎంతో అందంగా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రష్మిక చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.