బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ, లేటెస్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది, ఆ తర్వాత వదిలిన మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియా షేక్ అయ్యింది, ఇక లేటెస్ట్ గా వదిలిన టీజర్ చూస్తే టైగర్ నాగేశ్వర రావు రేంజ్ ఏంటో అర్ధమవుతుంది. అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న టీజర్… టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్స్ కి ప్రాపర్ బేస్ ని రెడీ చేసింది. షాట్ మేకింగ్, జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, లార్జర్ దెన్ లైఫ్ ఆర్ట్ వర్క్ ఇవ్వన్నీ టైగర్ నాగేశ్వరరావు టీజర్ ని మరింత ఎలివేట్ చేసాయి.
రవితేజ గజ దొంగ పాత్రకి సంబంధించిన లుక్ ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ ఒకటి రెండు షాట్స్ లో చూపించారు, వాటిలో టెర్రిఫిక్ గా ఉన్నాడు. రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న రవితేజ పాన్ ఇండియా హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమా నుంచి ‘ఏక్ ధమ్’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు. సెప్టెంబర్ 5న సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నాం అంటూ మేకర్స్ ఒక పోస్టర్ తో అనౌన్స్ చేసారు. ఈ పోస్టర్ లో రవితేజ లుక్ చూస్తుంటే ఇది ప్రెజెంట్ లో జరిగే సాంగ్ లా ఉంది. యాక్షన్ మోడ్ నుంచి లవ్ మోడ్ కి షిఫ్ట్ అయ్యి ఈ సాంగ్ తో టైగర్ నాగేశ్వర రావు టీమ్ ఎంతవరకూ అట్రాక్ట్ చేస్తారో చూడాలి.
https://twitter.com/AAArtsOfficial/status/1697483610998374508