YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కౌలు రైతులకు గుడ్న్యూస్ చెప్పారు.. రైతు భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి.. రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేశారు.. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థిక సాయం అందజేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ స్కీమ్ కింద మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరినట్టు అయ్యింది.. ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.. మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జమ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.
అయితే, భూ యజమానులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం.. మే నెలలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తూ వస్తున్నారు.. ఇదే సమయంలో.. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది సర్కార్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదే అన్నారు. భూమి లేని పేదలకు సైతం తమ ప్రభుత్వం ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆయన.. దేవుడి దయతో ఇవాళ రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. అందులో మొదటిది కౌలు రైతులకు సంబంధించి.. వారితో పాటు దేవాదయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు కూడా 2023-24 తొలివిడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నాం. రెండో మంచి కార్యక్రమం.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్ ముగిసేలోపే పరిహారం రైతన్నల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు.