Leading News Portal in Telugu

Rinku Singh: ఏంటి రింకూ భాయ్.. నీవు కొట్టే కొట్టుడుకు.. వాళ్లు ఏమైపోవాలి..


టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్‌ మరోసారి తన బ్యాటింగ్‌ పవర్‌ ఏంటో చూపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మరోసారి గుర్తు చేసే విధంగా సూపర్ ఓవర్ లో ఓ మ్యాచ్ ను రింకూ సింగ్ ఫినిష్ చేశాడు. అయితే, ప్రస్తుతం.. రింకూ ఉత్తర్‌ప్రదేశ్‌ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. ఈ లీగ్‌లో భాగంగా నిన్న (గురువారం) మీరట్ మావెరిక్స్, కాశీ రుద్రస్‌ జట్లు పోటీ పడ్డాయి.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మీరట్ మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేశారు. మీరట్ బ్యాటర్లలో కెప్టెన్‌ మాదవ్‌ కౌశిక్‌(87 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ తో రెచ్చిపోయి ఆడాడు. అయితే రింకూ మాత్రం తొలుత కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు.. అనంతరం లక్ష్య చేధనలో కాశీ రుద్రస్‌ సరిగ్గా 181 రన్స్ మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్‌ కాస్తా.. సూపర్‌ ఓవర్‌కు వరకు వెళ్లింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కాశీ రుద్రస్‌ 16 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ కు వచ్చిన మీరట్ కేవలం 4 బంతుల్లోనే టార్గెట్‌ను ఛేదించింది. కాశీ స్పిన్నర్‌ శివమ్‌ సింగ్‌ వేసిన సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్‌ వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను ఫినిష్‌ చేసేశాడు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కాగా ఐపీఎల్‌-2023 సందర్భంగా గుజరాత్‌ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదిన రింకూ మ్యాచ్‌ను కేకేఆర్‌ను గెలిపించాడు. ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ ​క్రికెట్‌లోకి రింకూసింగ్ అడుగు పెట్టాడు.