Yendira Ee Panchayithi Movie Yemo Yemo Lyrical Video Released: అందమైన గ్రామీణ ప్రేమ కథా సినిమాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమా తెరకెక్కగా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ఈ సినిమాతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లింప్స్ సైతం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకోగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ చేతుల మీదుగా ఏమో ఏమో అంటూ సాగే పాటను విడుదల చేయించారు మేకర్స్. పీఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీలు అనురాగ్ కులకర్ణి గాత్రం, సతీష్ మాసం విజువల్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలి, చూడాలనేట్టుగా ప్రెజెంట్ చేశాయి. ఎంతో వినసొంపుగా ఈ మెలోడీ పాటకు పీఆర్ స్వయంగా సాహిత్యాన్ని అందించారు.
Rashmika Mandanna: రష్మిక చేస్తున్న మూడు సినిమాలకు ఈ సిమిలారిటీ గమనించారా?
ఇక పాటను రిలీజ్ చేసిన అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ ‘గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ పాట బాగుంది, కొత్త వాళ్లైనా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, హీరో హీరోయిన్ల జంట బాగుందని అన్నారు.. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలని, టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు ఆయన. ఇక ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించగా కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఫస్ట్ కాపీ సిద్దమైన తరువాత త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.