Leading News Portal in Telugu

2nd ANM : సెకండ్ ఏఎన్ఎంలు సమ్మె విరమణ


తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ సెకండ్‌ ఏఎన్‌ఎంలు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు కోఠిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో సెకండ్‌ ఏఎన్ఎంల చర్చలు ఫలించాయి. దీంతో.. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరణ కు వైద్యరోగ్య శాఖ ఉన్నాతాధికారులుతో కమిటీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీంతో.. రేపటి నుంచి విధులుకి సెకండ్ ఏ ఎన్ ఎమ్ లు హాజరుకానున్నారు. అయితే.. తమ సర్వీస్‌ను రెగ్యులరైజ్‌ చేయడం, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు సమ్మె చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచనతో ఇప్పటికే పలుమార్లు ఏఎన్ఎంల‌తో ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు చర్చలు జరిపారు. శుక్ర‌వారం మ‌రోసారి ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్‌‌టీయూ తదితర సంఘాల లీడర్లు, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల ప్రతినిధుల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించారు.

కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల డిమాండ్ల అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయాలని వారు కోరుతున్నట్టుగా మా దృష్టికి వచ్చిందని డీహెచ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, కమిటీ వేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ వేస్తున్న అంశాన్ని కూడా ఏఎన్‌ఎంలకు వివరిస్తూనే, సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశాం. ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించారు. కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచే సమ్మె విరమిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 4వ తేదీ నాటికి కమిటీ వేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం జరగుతుంద‌ని శ్రీనివాస్ రావు తెలిపారు.