Leading News Portal in Telugu

Minister KTR : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..


యుఎస్ ఆధారిత స్పెషాలిటీ గ్లాస్, సిరామిక్స్ సంబంధిత మెటీరియల్స్, టెక్నాలజీస్ ప్రొవైడర్ కార్నింగ్ ఇంక్ తెలంగాణతో గొరిల్లా గ్లాస్ తయారీ యూనిట్‌తో భారతదేశానికి అరంగేట్రం చేస్తోంది. 934 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిపాదిత తయారీ కేంద్రం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోని మార్కెట్ లీడర్‌ల కోసం కవర్ గ్లాస్‌ను తయారు చేస్తుందని ఒక పత్రికా ప్రకటన తెలియజేసింది. కార్నింగ్ ఇంక్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. గ్లాస్ సైన్స్, సెరామిక్స్ సైన్స్, ఆప్టికల్ ఫిజిక్స్‌లో నైపుణ్యం కలిగిన ఫార్చ్యూన్ 500 మెటీరియల్స్ సైన్స్ కంపెనీ ఇది.

మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాట.. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు, రూ.934 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధికి అవకాశం లభించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త కొత్త కంపెనీలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు.. వాటిని మరింతగా విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే.. కోకాకోలా సంస్థ తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది.