Leading News Portal in Telugu

Bhagavanth Kesari: బిడ్డా!! చిచ్చా వచ్చిండు … మనకి పండగ ముందే తెచ్చిండు


Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో శ్రీ లీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహుగారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సాంగ్ పోస్టర్స్, ప్రోమోతో సోషల్ మీడియాని షేక్ చేసిన మేకర్స్ సాంగ్ తో మరోసారి షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. గణేష్ యాంథేమ్ ను రిలీజ్ చేసి అదరగొట్టేశారు.

Yemo Yemo: ‘ఏందిరా ఈ పంచాయితీ’ నుండి ఏమో ఏమో సాంగ్ రిలీజ్

గణేష్ ఉత్సవాల్లో బాలకృష్ణతో కలిసి శ్రీలీల ఊర మాస్ డాన్స్ చేస్తూ కనిపించింది. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ కు తమన్ మ్యూజిక్ అదరగొట్టేసాడు ఇకనుంచి వినాయక చవితి ఉత్సవాల్లో ఖచ్చితంగా ఈ పాట ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక శేఖర్ మాస్టర్ నేర్పించిన స్టెప్పులతో బాలయ్య, శ్రీలీల చేస్తుంటే థియేటర్ ఊగిపోతుంది అని చెప్పొచ్చు. కరీముల్లా, మనీషా ఆలపించిన ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడే కాదు ఇకముందు ఈ గణేష్ సాంగ్ సాన గట్టిగా వినపడుతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.