Leading News Portal in Telugu

Kichha Sudeep: RRR రచయితతో కిచ్చా సుదీప్ గ్లోబల్ మూవీ..!


కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోలలో ఎక్కువగా వినిపించే పేరు ఇతనిదే.. ఈ హీరోకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.. దర్శక దీరుడు రాజమౌళి తెరకేక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఈగ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. మరి ఈ సినిమాకి అలాగే రాజమౌళి అన్ని చిత్రాలకి సహా గ్లోబల్ సెన్సేషన్ RRR కి రచయితగా చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో అయితే మరోసారి సుదీప్ వర్క్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది…

ఈరోజు హీరో పవన్ కళ్యాణ్ తో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు కూడా ఈ రోజే. కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ సినిమా ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించాడు…ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషేష్ తెలుపుతున్నారు.. నేడు తన 52 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.. సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు సుదీప్..

ఇదిలా ఉండగా.. ఈరోజు సుదీప్ బర్త్ డే కానుకగా అయితే ఆర్ సి స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ ని అయితే ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రాన్ని రీసెంట్ గా కన్నడ సినిమా దగ్గర భారీ సినిమాగా చేసిన “కబ్జ” దర్శకుడు ఆర్ చంద్రు ఈ సినిమాను తెరకేక్కిస్తున్నారు.. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో కిచ్చా సుదీప్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..