Adult Vaccination: వ్యా్క్సినేషన్ గురించి మన దేశంలో చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. ఏదో చిన్న పిల్లలకు ఆశా వర్కర్లు వచ్చి చెబితే వ్యాక్సిన్లు వేయిస్తూ ఉంటారు. డెలీవరి సమయంలో పిల్లలకు వేయించాల్సన టీకాల గురించి వైద్యలు చెబుతూ ఉండటంతో వాటి గురించి తెలుస్తోంది. అయితే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్ద వారికి కూడా టీకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో అనారోగ్యం, ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటంలో కొన్ని వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. మధుమేహంతోపాటు ఇతర వ్యాధిగ్రస్థులకు ఇన్‌ఫెక్షన్ సమయంలో ఈ టీకాలు తీసుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది. మనలో ఇప్పటికీ చాలా మందికి టీటీ(టెటానస్ టాక్సాయిడ్), హెబ్‌వీ (హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్, కుక్కకాటు, యాంటీ రేబిస్ టీకా) లాంటివి మాత్రమే తెలుసు.
కానీ పెద్దవారి కోసం కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ ఉంది. అయితే మన దేశంలో వారికి దీనిపై పెద్దగా తెలియక పోయినా విదేశాలలో మాత్రం దీనిపై చాలా మందికి అవగాహన ఉంటుంది. 50 ఏండ్లు దాటిన వారికి వీటిని వేయిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. న్యుమోనియా, ఫ్లూ, హెపటైటిస్ బీ, షింగిల్స్ నివారణకు ఈ టీకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక మన దేశంలో కూడా కేవలం గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో ఉంటున్న వారికి కూడా వీటి గురించి తెలియదు. తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా లాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న వారు కూడా వీటి గురించి తెలుసుకోలేకపోతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి తెలిపిన సర్వే లో హైదరాబాద్‌లో 50 ఏండ్ల వయస్సు పైబడిన 53 శాతం మందికి అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి తెలుసునని వెల్లడయ్యింది అయితే వీరిలో నాలుగు శాతం మంది మాత్రమే వ్యాక్సినేషన్ తీసుకోవడం బాధాకరం. కరోనా సమయంలో తప్ప ఇంకెప్పుడు పెద్దలకు కూడా టీకాలు వేయించడం అనే విషయాన్ని మన దేశంలో ఉన్న వారు గుర్తించి ఉండదు. ఇప్పటికైనా ఇంట్లో పెద్దవారికి ఈ అడల్ట్ వ్యాక్సిన్ వేయిస్తే వారిని చాలా వ్యాధుల నుంచి రక్షించవచ్చు.