Leading News Portal in Telugu

AP CM Jagan: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్


AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మల్టిపుల్ డిజేబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల బైపిళ్ళ నారాయణ నిఖిల్‌కు సీఎం జగన్‌ ఆర్థిక సహాయం చేశారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుని వివాహానికి హాజరైన సందర్భంగా చిన్నారి నిఖిల్ తల్లిదండ్రులు సీఎం జగన్‌ను కలిశారు.

ఎడమ కన్ను, చెవి అంగవైకల్యం మల్టిపుల్ డిజేబిలిటీతో నిఖిల్‌ బాధపడుతున్నాడు. విజయవాడ నగరంలోని భవానిపురంలో బైపిళ్ళ రమేష్, లక్ష్మీ పద్మ దంపతులు తమ కుమారుడు నిఖిల్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. చిన్నారి అనారోగ్య సమస్యలను సీఎంకు స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వివరించగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. నిఖిల్‌కు వైద్య సేవల కోసం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వెంటనే లక్ష రూపాయల చెక్కును కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అందజేశారు. ముఖ్యమంత్రి అందించిన ఈ సాయానికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.