Leading News Portal in Telugu

IndvsPak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు..



Match Cancel

ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత ఇన్సింగ్స్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో ఫీల్డ్ ఎంపైర్లు మ్యాచ్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అంతకు ముందు పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో జరుగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా.. పాక్ బౌలర్ల ధాటికి చతికిలపడింది. షాహీన్‌ అఫ్రిది, హరీస్‌ రౌఫ్‌, నసిమ్ షా నిప్పులు చెరిగే బంతులు విసరడంతో 266 పరుగులకే భారత జట్టు కుప్పకూలిపోయింది.

Read Also: AP CM Jagan London Tour: లండన్‌ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్

అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాని ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి ఆదుకున్నారు. చివర్లో జస్ప్రిత్ బుమ్రా కూడా 16 పరుగులు చేయడంతో టీమిండియా… గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 53 బంతుల్లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేయగా.. వన్డేల్లో ఇషాన్ కిషన్‌కి ఇది ఏడో హాఫ్ సెంచరీ కాగా మిడిల్ ఆర్డర్‌లో మొట్టమొదటిది.. ఇంతకు ముందు ఇషాన్ కిషన్ చేసిన 6 వన్డే హాఫ్ సెంచరీలు కూడా ఓపెనర్‌గా చేసినవే.. 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు బాదిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు 2008 ఆసియా కప్‌లో ధోనీ 76 పరుగులు చేయడమే ఆసియా కప్‌లో భారత వికెట్ కీపర్‌కి అత్యధిక స్కోరుగా ఉంది.

Read Also: Samantha: సమంత.. రేణు దేశాయ్ లా మారుతుందా..?

హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 87 పరుగులు ) హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వన్డేల్లో హార్ధిక్ పాండ్యాకి ఇది 11వ హాఫ్ సెంచరీ.. కాగా.. హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ కలిసి ఐదో వికెట్‌కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఐదో వికెట్‌కి టీమిండియా తరుపున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇషాన్ కిషన్, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా.. ఇక, హార్ధిక్ పాండ్యా, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. పాండ్యా అవుటైన ఓవర్‌లోనే రవీంద్ర జడేజా కూడా డగౌట్ బాట పట్టాడు. శార్థల్ ఠాకూర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

Read Also: India vs Pakistan LIVE Score, Asia Cup 2023: భారత్-పాక్‌ మ్యాచ్‌ రద్దు

టీమిండియా 242 పరుగులకే 8 వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ కలిసి 9 వ వికెట్‌కి 19 రన్స్ జోడించారు. 13 బంతుల్లో 4 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, నసీం షా బౌలింగ్‌లో రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఇక, 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 రన్స్ చేసిన జస్ప్రిత్ బుమ్రా, నసీం షా బౌలింగ్‌లో సిక్సర్‌కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిదీకి 4 వికెట్లు దక్కగా.. హారీస్ రౌఫ్ 3 వికెట్లు.. నసీం షాకి 3 వికెట్లు తీసుకున్నారు.