Tollywood Heroes: తెలుగు చిత్ర పరిశ్రమ.. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు.. బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకుంటే.. ట్రెండ్.. ఆ తరువాత జీన్స్ వేసుకొంటే ట్రెండ్.. ఇక జనరేషన్ మారేకొద్దీ ట్రెండ్స్ అలా మారిపోతూ వచ్చాయి. ఒక్కో జనరేషన్ కు ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో లుంగీల ట్రెండ్ నడుస్తోంది. ఆ లుంగీలను మడతపెట్టి.. కడితే.. నా సామీ రంగా .. థియేటర్లు పగిలిపోవాల్సిందే. ఒకప్పుడు హీరోలు లుంగీలు కడితే .. ఏంటి.. ఈ హీరో ఇలా కనిపించాడు.. స్టైల్ గా లేడు అనేవారు.. కానీ, ఇప్పుడు అదే లుంగీ ఫేవరేట్ హీరో కడితే.. అస్సలు లుంగీలో ఎంత క్లాస్ గా ఉన్నాడురా అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు.. లుంగీ స్టైల్.. విజయాలను కూడా తెచ్చిపోయేడుతుంది. మహేష్ బాబు లుంగీ కట్టాడు అంటే .. హిట్ అని అభిమానుల సెంటిమెంట్. అందుకే గుంటూరు కారంలో కూడా మహేష్ లుంగీ లుక్ తో కనిపించాడు.
పోకిరి దగ్గరనుంచి గుంటూరు కారం వరకు.. సీన్ లోనైనా, సాంగ్ లోనైనా మహేష్ లుంగీ కట్టాల్సిందే. ఒక్క మహేష్ అనే కాదు.. సీనియర్, జూనియర్ హీరోలు అని లేదు.. అందరు ఆ లుంగీలను మడతపెట్టి.. కట్టేస్తూ మాస్ లుక్ లో అదరగొడుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్, నాని, విశ్వక్ సేన్.. ఇలా అందరు లుంగీలు కట్టి మాస్ లుక్ లో అదరగొట్టినవారే.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ మాస్ కథలకే అభిమానులు ఓటు వేస్తున్నారు. ఇప్పటివరకు మన టాలీవుడ్ హీరోలు క్లాస్ సినిమాలు చాలా చేశారు.. లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేశారు. ఇక ఇప్పుడు అంతా మాస్ మీద ఫోకస్ పెట్టారు. అందుకు కారణం అభిమానుల అభిరుచి మారడం. మా హీరో ఇలా ఉంటేనే మేము అంగీకరిస్తాం.. అన్నదగ్గరనుంచి.. కథను బట్టి మా హీరో ఎలా ఉన్నా మాకు ఓకే అనేవరకు వచ్చారు. దీంతో అభిమానులను ఎప్పటికప్పుడు మెప్పించడానికి వారి పల్స్ ను మేకర్స్ తెలుసుకొని సినిమాలు తీస్తున్నారు. ఇక ఇప్పుడు అభిమానులు తమ హీరోల లుంగీల లుక్ లు కావాలంటూ మేకర్స్ డిమాండ్ చేయడం వరకు వచ్చారు. ప్రస్తుతం గుంటూరు కారం లో మహేష్ లుంగీ లుక్ తో కనిపించాడు.. అంతకు ముందు భీమ్లా నాయక్ సినిమాలో పవన్, రానా ఇద్దరు లుంగీల్లో కనిపించి హల్చల్ చేశారు.
ఇక రంగస్థలంలో రామ్ చరణ్.. దువ్వాడ జగన్నాథం లో అల్లు అర్జున్.. దసరాలో నాని, నా సామీ రంగాలో నాగార్జున, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో విశ్వక్ సేన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలు లుంగీలపై మనసు పడ్డారు. లుంగీ కట్టి, మీసం మెలేసి బరిలోకి దిగితే.. బాంచాత్ ఎదురుగా ఉన్న విలన్ కు చావు భయం కనిపించాల్సిందే. ఇక ఇదే లుక్ ను అభిమానులు కూడా ఇష్టపడడం విశేషం. ఏదిఏమైనా లుంగీ కట్టిన లుక్ లో ఉండే మాస్ మరెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. మరి ఇప్పుడు వస్తున్న హీరోలకు ఈ లుంగీ లుక్ ఎలాంటి విజయాలను అందిస్తుందో చూడాలి.