Leading News Portal in Telugu

Swami Prasad Maurya: “భారత్ హిందూదేశం కాదు”.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై ఆగ్రహం..


Swami Prasad Maurya: ఉత్తర్‌ప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ‘హిందూ రాష్ట్రం’ అని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై మౌర్య మండిపడ్డారు. భారతదేశం హిందూ దేశం మౌర్య అన్నారు. భారత్ హిందూదేశంగా ఎప్పుడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగం లౌకిక రాజ్య భావనలపై ఆధారపడి ఉందని, భారతదేశంలో ప్రజలంతా భారతీయులే, మన రాజ్యాంగం అన్ని మతాలు, అన్ని విశ్వాసాలకు, సంస్కృతులకు ప్రాతినిథ్యం వహిస్తోందని మౌర్య తన ట్విట్టర్ అకౌంట్ లో రాశారు.

ఇటవల నాగ్‌పూర్ ‘మధుకర్ భవన్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారతదేశం హిందూ దేశం అని, భారతీయులంతా హిందువులు అని, హిందువులే భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. భారత్ ఒక హిందూ రాష్ట్రం, ఇది వాస్తవమని, సైద్ధాంతికంగా భారతీయులందరూ హిందువులు అని, హిందువులు అంటే భారతీయులు అని.. ఈ రోజు భారత్ లో ఉన్న వారందరూ హిందూ సంస్కృతి, హిందూ పూర్వీకులకు, హిందువులకు చెందిన వారని అన్నారు.

మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్వామి ప్రసాద్ మౌర్య ఇలా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే గతంలో కూడా మౌర్య హిందూ మతం, రామచరిత మానస్ గ్రంథాలపై నోరుపారేసుకున్నారు. ఇటీవల హిందూ మతం బూటకమని, బ్రహ్మణవాదం ఆదివాసులను, వెనకబడిన తరగతులను అణిచివేశాయని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్పీ పార్టీ మౌర్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధ లేని ప్రకటించింది.