మారిన కాలం, ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల అనారోగ్యం సమస్యలు ఎదురైవుతాయి.. టైం కు తినకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. శరీరానికి పడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారతుుంది. ఈ అసిడిటీ సమస్య ఉన్నప్పుడు ఛాతీపై ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని పదార్థాలను తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలి అవేంటో ఒకసారి చూద్దాం.
*. కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌ని తగ్గిపోతుందని చెబుతున్నారు. కానీ, ఈ డ్రింక్స్‌లో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. ఇది కడుపులోకి ప్రవేశించినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది..
*. ఉల్లి, వెల్లుల్లిలో ఎక్కువగా ఫ్రక్టాన్లు ఉంటాయి. ఈ మూలకాలు కరిగే ఫైబర్స్. ఇవి కడుపులో తీవ్రమైన ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా, పచ్చి కూరగాయల సలాడ్ కూడా ఈ సమస్యను కలిగిస్తుంది..
*. ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యాబేజీలు తినడం వల్ల కడుపులో అసిడిటీ ఏర్పడుతుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్య నుంచి నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి..
*. పప్పు ధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బీన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఒలిగోశాకరైడ్స్ జీర్ణక్రియ బలహీనమైనప్పుడు వీటిని జీర్ణం చేసుకోలేం… అందుకే తక్కువగా తీసుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు..
*. ఆహారం తిన్న తర్వాత సెలెరీ, సోంపు, జీలకర్ర కషాయాలు తీసుకోవాలి.ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల నీటిని తాగాలి.. ఉప్పు వాడకాన్ని తగ్గించడం మంచిది.. ఆహారాన్ని నిదానంగా నమిలి తినడం మేలని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదు నీరును ఎక్కువగా తీసుకోవాలి.. 8గంటలు నిద్ర పోవాలి అప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుంది..