Leading News Portal in Telugu

Sonia Gandhi: సోనియా గాంధీకి అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక


Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం పాలయ్యారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో ఢిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు పరీక్షలు జరిపారు, ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది పలు ఆరోగ్య సమస్యలతో రెండు సార్లు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు.

వైరల్ రెస్పటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12, 2023న సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరి జనవరి 17న డిశ్చార్జ్ అయ్యారు. దీని తర్వాత మార్చి 2న జ్వరం కారణంగా ఇదే ఆస్పత్రిలో చేరారు. తాజాగా మరోసారి అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు.

ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది. ఇటీవల ముంబై వేదికగా ఈ కూటమి మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 రెండు రోజులు జరిగాయి. ఈ సమావేశానికి సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ 2024లో మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఇండియా కూటమి వరసగా సమావేశాలు నిర్వహిస్తోంది.