Leading News Portal in Telugu

TTD: టీటీడీ స్థానికాల‌యాల్లో ఈ నెల జరగనున్న ఉత్సవాలు ఇవే


సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ స్థానికాల‌యాల్లో వివిధ విశేష ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబ‌రు 7న గోకులాష్టమి సందర్బంగా ఎస్వీ గోశాల‌లో గోపూజ‌ నిర్వహించనున్నారు. సెప్టెంబ‌రు 9న తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో శిక్యోత్సవం(ఉట్లోత్సవం) జరగనుంది. సెప్టెంబ‌రు 10న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి చిన్నవీధి శిక్యోత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబ‌రు 11న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి పెద్దవీధి శిక్యోత్సవం, సెప్టెంబ‌రు 18న వినాయ‌క చ‌వితి రోజున‌ శ్రీ క‌పిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబ‌రు 24 నుండి 27వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. మరోవైపు సెప్టెంబ‌రు 26 నుండి 29వ తేదీ వ‌ర‌కు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలనుకునే వారు ఈ సమాచారం ఆధారంగా   మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.

ఇక భూమనకరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తరువాత తొలిసారి టీటీడీ పాలకమండలి ఎల్లుండి సమావేశం కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజున సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. వీటికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇక ఈరోజు ఐదుగురు టీటీడీ పాలకమండలి సభ్యులు పోన్నాడ సతీష్,సామినేని ఉదయ్ భాను,మేకా శేషుబాబు,అమోల్ కాలే,శంకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.