Leading News Portal in Telugu

Burning Man Festival: అయ్యో పాపం.. పండుగకొచ్చి ఇరుక్కుపోయారో.. బురదలో 70 వేల మంది


Burning Man Festival: అక్కడికి వచ్చిన వారందరూ పండగ కోసమని ఎంతో ఉత్సాహంగా అక్కడికి వచ్చారు. పండుగలో ఆనందంగా గడపాల్సిన వారు అనుకోని పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోవాల్సింది. ఇలా ఇరుక్కున్నది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 70 వేల మంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది జరిగింది నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో.

అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌ చాలా ఫేమస్. చాలా మందికి దీనికి హాజరుకావడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో ఆగస్టు 27న ఈ ఫెస్టివల్ మొదలైంది. దీనిలో పాల్గొనేందుకు 70 వేల మంది వరకు వచ్చారు. అయితే తర్వాతి రోజు రాత్రి అక్కడ అతి భారీ వర్షం కురిసింది. ఎంతలా కురిసిందంటే మూడు నెలల్లో కురవాల్సిన వాన మొత్తం ఒక్క రాత్రిలోనే కురిసింది. దీంతో పొడిగా ఉండాల్సిన ఎడారి తడిసి ముద్దయిపోయింది. అంతా బురదమయం అయిపోయింది.

దీంతో అక్కడ జరగాల్సిన ఈవెంట్లు రద్దయ్యాయి. అంతేకాకుండా బురద కారణంగా ఎక్కడి వారు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కాలు బయట పెట్టినా బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. బయట వారు లోపలికి రాకుండా బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ ను మూసేసింది. వాహనాలు బురదలో చిక్కుకొని కదలలేకుండా ఉన్నాయి. చుట్టూ కొన్ని మైళ్ల దూరం వరకు ఎటుచూసినా బురదే కనిపిస్తోంది. దీంతో ఆ ప్రాంతం ఎండే వరకు అక్కడే ఆహారం, నీరు తీసుకుంటూ పొడిగా ఉండే ప్రాంతాన్ని చూసుకొని విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పండుగ కోసం వెళ్లి ఇరుక్కుపోయే పాపం అంటూ ఈ వీడియో చూసిన వారు జాలి చూపిస్తున్నారు.