ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను అందిస్తుంది.. ఎన్నో కొత్త స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మాత్రం భారీ ఆదాయాన్ని అందిస్తున్నాయి.. మరికొన్ని మాత్రం రిస్క్ లేకుండా కొత్త స్కీమ్ ను అందిస్తుంది..ఈ పథకంలో చేరితే ఏకంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. కాస్త వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ యాన్యుటీ ప్లస్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది ఇండివీజువల్ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్, జనరల్ యాన్యుటీ ప్రొడక్ట్. ఈ స్కీమ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ గ్యాంరటీ ఇన్‌కమ్ పొందొచ్చని అధికారులు చెబుతున్నారు.. ఇకపోతే ఈ ప్లాన్‌లో డిఫర్డ్, ఇమ్మీడియట్ యాన్యుటీ ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. అలాగే జాయింట్ లైఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 30 ఏళ్లు వయసు కలిగిన వారు ఇమ్మీడియట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇక డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ అయితే 45 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు తీసుకోవచ్చు..
నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున మీరు యాన్యుటీ స్కీమ్ కింద పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్లకు లక్ష పొందే అవకాశం ఉంది.. రూ.లక్ష పెన్షన్ పొందాలని భావిస్తే మాత్రం మీరు రూ.1,55,92,516 చెల్లించాల్సి ఉంటుంది.. లైఫ్ యాన్యుటీ కింద 60 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ. 50 వేలు పొందాలని భావిస్తే.. రూ. 78 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే ఆప్షన్ ఎంచుకుంటే అప్పుడు మీరు రూ. 94 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ప్రతి నెలా రూ.50 వేలు వస్తాయి.. అంటే ఒక్కో ప్లాన్ కింద ఒక్కోటి అని తెలుసుకోవాలి.. డబ్బులు ఇన్వెస్ట్ చేసే కొద్ది మీకు పెన్షన్ కూడా పెరుగుతుంది..