బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీ మరో మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో పఠాన్ మూవీతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో అంతకు మించి కలెక్ట్ చేసేలా ఉన్నాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్… ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో జవాన్ సినిమా బుకింగ్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి. రిలీజ్ కి 72 గంటల ముందే జవాన్ సినిమాకి రెండున్నర లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి అంటే ఓపెనింగ్ డే ఏ రేంజులో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఓవర్సీస్ లో జవాన్ నెవర్ బిఫోర్ బుకింగ్స్ ని రాబడుతుంది. అట్లీ కారణంగా షారుఖ్ సినిమాకి సౌత్ లో కూడా సూపర్బ్ బుకింగ్స్ వస్తున్నాయి. నయనతార, అట్లీ, అనిరుద్ లకి సౌత్ లో ఉన్న ఇమేజ్ జవాన్ కలెక్షన్స్ ని బూస్ట్ చేయనున్నాయి. ఇది చాలదన్నట్లు స్వయంగా షారుఖ్ ఖాన్ చెన్నైకి వచ్చి మరీ జవాన్ సినిమాని ప్రమోట్ చేయడంతో తమిళనాడులో జవాన్ డిమాండ్ పెరిగింది. సో ఓవరాల్ గా 100 కోట్ల ఓపెనింగ్ డే రికార్డుని చూడబోతున్నామని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఇదే జరిగితే ఒకే ఏడాది రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన మొదటి హీరోగా షారుఖ్ ఖాన్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో ఇంటరాక్ట్ అవ్వడం ఎక్కువగా చేస్తున్న షారుఖ్ ఖాన్… లేటెస్ట్ గా ఒక తమిళ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకి సూపర్బ్ ఆన్సర్ ఇచ్చాడు.
ఇటీవలే చెన్నై వచ్చారు కదా ఎవరైన సెలబ్రిటీ కలవాలి అనుకున్నారా? అని ఫ్యాన్ అడగగా… సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసాను, దళపతి విజయ్ ని కలిసాను, తల అజిత్ ని మాత్రమే మిస్ అయ్యాను. త్వరలో అజిత్ ని కూడా కలుస్తాను అంటూ షారుఖ్ రిప్లై ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, అజిత్ ని త్వరలో కలుస్తాను అనగానే అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షారుఖ్ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. అయితే అతి తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే… షారుఖ్-అజిత్ కలిసి ‘అశోక’ అనే సినిమా చేసారు. 2001లో రిలీజ్ అయిన ఈ మూవీలో షారుఖ్ టైటిల్ రోల్ ప్లే చేయగా… అజిత్ ‘సుసిమ మౌర్య’ అనే పాత్రలో షారుఖ్ కి ‘అన్న'(సవితితల్లి కొడుకు)గా నటించాడు. ప్రీతీ జింటా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి కానీ సినిమా యావరేజ్ గా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 22 ఏళ్లు గడుస్తున్నా షారుఖ్-అజిత్ మళ్ళీ కలిసి నటించలేదు. మరి ఫ్యూచర్ లో ఈ ఇద్దరు సూపర్ స్టార్ కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తారేమో చూడాలి.
I met Rajni sir. I met Vijay Thalapathi. Missed meeting Ajith but will do soon. #Jawan https://t.co/c45cWo6rSJ
— Shah Rukh Khan (@iamsrk) September 3, 2023