Leading News Portal in Telugu

iPhone 13 Price Drop: ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్‌.. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే!


Apple iPhone 13 Price Drop in Flipkart: ‘యాపిల్‌’ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 15 సిరీస్‌ త్వరలోనే మొబైల్ మార్కెట్‌లోకి రానుంది. సెప్టెంబర్‌ 12న మెగా ఈవెంట్‌ను యాపిల్‌ నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్‌లను గ్లోబల్‌గా లాంచ్‌ చేయనుంది. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్‌లతో పాటు మరిన్ని ఉత్పత్తులను కూడా లాంచ్ ఈవెంట్‌లో యాపిల్ ప్రదర్శనచనుంది.

ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్‌లు త్వరలో గ్లోబల్‌ మార్కెట్‌లోకి రాబోతున్న నేపథ్యంలో యాపిల్ తన ఐఫోన్‌ 13 ధరలను తగ్గించింది. ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే ఐఫోన్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. ఐఫోన్‌ 13 అసలు ధర రూ. 69,900. ప్రస్తుతం ఈ ఫోన్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 58,999కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లలో 15 శాతం తగ్గింపు ఆఫర్ అనంతరం రూ. 58,999కి అందుబాటులో ఉంది. అంటే మీరు రూ. 10,901 ఆదా చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 13 మోడల్‌పై బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేస్తే.. మరో రూ.3 వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. అంటే ఆఫర్‌ పోనూ రూ. 55,999కే లభిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత తక్కువ ధరకు ఐఫోన్‌ 13 లభించలేదని టెక్‌ వర్గాలు అంటున్నాయి. అయితే అమెజాన్‌లో ప్రస్తుతం కార్డు ఆఫర్స్ అందుబాటులో లేవు. ఐఫోన్‌ 13 కొనేందుకు ఇదే మంచి సమయం అని చెప్పొచ్చు.