Leading News Portal in Telugu

Vivo V29 Launch: కళ్లు మిరుమిట్లు గొలిపే ‘వివో వీ29’ లాంచ్.. అద్భుత కెమెరా, బలమైన బ్యాటరీ!


Vivo V29 5G Smartphone Launch Date in India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ.. మొబైల్ ప్రియులను తనవైపు తిప్పుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లనే కాకుండా తక్కువ ధరలో కూడా ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల ‘వివో వీ29ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన వివో.. మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ‘వివో వీ29’ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉందని లీక్స్ వెల్లడించాయి.

Vivo V29 Price In India:
వివో వీ29 స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ వెల్లడించారు. భారతదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని చెప్పాడు. అయితే సరైన తేదీని మాత్రం అతడు వెల్లడించలేదు. వివో వీ29 స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంతో సహా 39 దేశాలలో అందుబాటులో ఉంటుందని వివో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ధర దాదాపు CZK 8,499 (భారత కరెన్సీలో రూ. 32,179) ఉంటుంది.

Vivo V29 Camera:
వివో వీ29 స్మార్ట్‌ఫోన్‌ 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనికి ఆటో ఫోకస్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ మరియు రింగ్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Vivo V29 Battery:
వివో వీ సిరీస్ ఫోన్‌ల మాదిరే వీ29 స్మార్ట్‌ఫోన్‌ కూడా సన్నగా మరియు సొగసైనదిగా ఉంటుంది. 7.46mm మరియు బరువు 186 గ్రాములు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 8GB RAM మరియు 256GB స్టోరేజ్ వేరియెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Vivo V29 Specs:
వివో వీ29 స్మార్ట్‌ఫోన్‌ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది అద్భుతమైన డిజైన్‌, సూపర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. 6.78 ఇంచెస్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇందులో ఉంటుంది. డిస్‌ప్లే రిజల్యూషన్ 1260 x 2800 పిక్సెల్‌లు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తుంది.