టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు నాగార్జున.. ఎప్పటిలాగే అదిరిపోయే సాంగ్ తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు.. బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లని పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు నేటి ఆదివారం(సెప్టెంబర్ 3) గ్రాండ్‌గా బిగ్ బాస్ ఏడో సీజన్‌ని ప్రారంభించబోతున్నారు. ఈ సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది..
బిగ్ బాస్ 6 వరకు ఉన్న సెట్, సెటప్ వేరు ఇప్పుడున్న సెటప్ వేరు.. ఇప్పటివరకు కనీసం సెట్ ను చూపించని నాగ్ ఇప్పుడు డైరెక్టర్ గా రివిల్ చేశారు.. హౌజ్‌లో కొత్త రూమ్‌లు, కొత్త విభాగాలు కూడా ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా కెప్టెన్ రూమ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ మేరకు హౌజ్ ఫోటోలను వదిలారు. అవన్నీ కాస్త కొత్తగా ఉందనిపిస్తుంది. అయితే ఈసారి పింక్ కలర్‌కి ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.. మొత్తానికి హౌస్ చాలా కలర్ ఫుల్ గా ఉంది..
ఇకపోతే ఉల్టాఫల్టా అంటూ నాగార్జున ప్రారంభం నుంచి చెబుతున్నారు. ఈ సారి లెక్క వేరే అంటున్నారు. అందరు ఊహించినట్టుగా ఉండబోదని, మా ఆట వేరే అంటున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆసక్తి ఏర్పడింది. ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఏర్పడింది.. అయితే దానికి అర్థం ఇప్పుడు దొరికేసింది.. ఈ సారి కంటెస్టెంట్లు ఎవరెవరనేది సస్పెన్స్ ఏర్పడింది. ఇందులో నటుడు శివాజీ రాబోతున్నారట. ఆయనతోపాటు శోభా శెట్టి,విష్ణు ప్రియా, ఆట సందీప్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, భోలే షావలి, టీవీ9 ప్రత్యూష, షకీలా, టేస్టీ తేజా, మహేష్ ఆచంట, అంబటి అర్జున్, అపూర్వ, సింగర్ దామిని భాట్ల పాల్గొనబోతున్నారు.. ఇకపోతే మొదటగా ప్రియాంక హౌస్ లోకి వచ్చింది.. హౌస్ లోకి రాగానే సూట్ కేసు ఇచ్చి అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు.. మొదట్లోనే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటా అని ఆలోచనలో పడ్డారు.. చూద్దాం ముందు ముందు ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో..