Leading News Portal in Telugu

Railway Services: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రైళ్లు రద్దు


Railway Services Cancelled: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో పలు రైళ్లు పూర్తిగా రద్దుకానుండగా, మరికొన్ని పాక్షికంగా రద్దు అవనున్నాయి. నేటి నుంచి ఈ నెల 10 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. విజయవాడ సెక్షన్‌లో భద్రతాపరమైన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఇక శాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్, గుంటూరు- రాయగఢ్ ఎక్స్ ప్రెస్, విశాఖ-విజయవాడ- విశాఖ-రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. 4 నుంచి 10వ తేదీ వరకు లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేయబడింది.

మరోవైపు ఈనెల 5 నుంచి కాకినాడ-విశాఖ-కాకినాడ ప్యాసింజర్, గుంటూరు-విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్, రాజమండ్రి-విశాఖ ఇంటర్ సిటీ….విశాఖ రద్దు కానున్నాయి. ఈనెల 5, 6, 8, 9 తేదీల్లో విశాఖ-విజయవాడ-విశాఖ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు కానున్నాయి. ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రద్దు. కాగా తిరుపతి-విశాఖపట్నం డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబరు 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-తిరుపతి డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబరు 7, 9 తేదీల్లో సామర్లకోట నుంచి బయలుదేరి తిరుపతి చేరుతుంది. సామర్లకోట-విశాఖపట్నం మధ్య రాకపోకలను పాక్షిక రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆసమయంలో ప్రయాణాలు ఉన్న వారు గుర్తుంచుకోవాలి. ఇక రైళ్ల రద్దుతో ఆర్టీసీకి ప్రయాణీకుల తాకిడి పెరిగింది. దీంతో బస్ స్టేషన్లు రద్దీగా మారడంతో పాటు, దూరప్రాంత టికెట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో విజయవాడ, కాకినాడ మార్గాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు ప్రయాణీకులు. రైళ్లు రద్దు కావడంతో వీటిని గమనించి ముందుగానే తమ ప్రయాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.