YV Subba Reddy: మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జమిలీ కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామన్న ఆయన సీఎం జగన్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని సుబ్బారెడ్డి కితాబిచ్చారు. ఇక పోటీ విషయం గురించి మాట్లాడుతూ ప్రతి నిర్ణయం జగనే తీసుకుంటారన్నారు. .ఎన్నికల్లో పోటీ విషయంలో సీఎం జగన్ ఎలా నిర్ణయిస్తే అలా చేస్తామని తెలిపారు.
ఇక తన పోటీ విషయం గురించి మాట్లాడుతూ ఎక్కడ పోటీచేయాలని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ఆయన పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఇక మాజీమంత్రి బాలినేనిపై కుట్రల గురించి ప్రశ్నించగా బాలినేనిపై ఎవరు కుట్రలు చేశారో తనకు తెలియదని అలా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆ ఆలోచన కూడా తనకు లేదని తేల్చి చెప్పారు. తాను కేవలం పార్టీ అప్పగించిన భాద్యతలు నిర్వర్తించుకుంటూ వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు రావడంపై ఆయన స్పందించారు. ఏమి చేయకుండా ఊరికే ఐటీ నోటీసులు రావు కాదా అని ప్రశ్నించారు. అక్రమంగా నిధులు వచ్చాయని నిర్ధారణ అయ్యాకే ఐటీ సమన్లు ఇస్తారని పేర్కొన్నారు. తాను నిజాయితీ పరుడ్ని అని గంటలు గంటలు చెప్పుకునే చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన అవినీతికి నిదర్శనాలే ఐటీ నోటీసులని పేర్కొ్న్నారు.