Seven Hills Production number 3 is gearing up for release: గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3గా ఓ సినిమా తెరకెక్కుతోంది. పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గతంలో ‘బట్టల రామస్వామి బయోపిక్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత ఆర్.పి.పట్నాయక్‌తో ఓ సినిమా చేశారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న మూడో సినిమా ఇదే. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ ‘‘ఒక స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథ ఇదని, యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం అలరిస్తుందని, త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తామని అన్నారు.
Kushi: ఖుషి సినిమాపై రేటింగ్స్ దాడి.. విజయ్ పై బూతుల వర్షం.. వెనకున్నది వారే?
ఇక హీరో గౌతం కృష్ణ ‘ఆకాశవీధుల్లో’ చిత్రంతో మంచి గుర్తింపు పొందగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాతో స్టూడెంట్ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు’’ అని అన్నారు. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘విజయవంతంగా మూడు షెడ్యూళ్లు పూర్తి చేశామని, త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసి నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్ చక్రపాణి, భద్రం, పింగ్ పాంగ్ సూర్య తదితరులు నటించారు. జుడా శాండీ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరించారు.