తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు | devotees rush continue in tirumala| sarva| darshnam| 24hours| hundi| kanukalu| pilgrims
posted on Sep 4, 2023 7:18AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 3) శ్రీవారిని 81వేల 439 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32వేల899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 5లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (సెప్టెంబర్ 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.