Leading News Portal in Telugu

Vaadivaasal: అసలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా సూర్యా సర్?


వెట్రిమారన్… ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్. కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో వెట్రిమారన్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. గత పదహారు సంవత్సరాల్లో కేవలం అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి, ఇందులో మూడు సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అంటే వెట్రిమారన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వెట్రిమారన్ కి సూర్య లాంటి స్టార్ హీరో అండ్ వెర్సటైల్ యాక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టింది ‘వాడివాసల్’ మూవీ. వీ క్రియేషన్స్ బ్యానర్ పై 2019 డిసెంబర్ లో అనౌన్స్ అయిన వాడివాసల్ సినిమాకి కోలీవుడ్ లో మాత్రమే పాన్ కాదు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది.

వెట్రిమారన్-సూర్య కాంబినేషన్ లో జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ సినిమా అనగానే డైరెక్టర్ కి హీరోకి నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే సరిపెట్టుకుంది. గత నాలుగేళ్లలో వాడివాసల్ నుంచి కేవలం టైటిల్ రివీలింగ్ పోస్టర్ తప్ప ఇంకో అప్డేట్ బయటకి రాలేదు. సరే బాహుబలి రేంజులో సీక్రెట్ గా చేస్తున్నారా అని చూస్తే అది కూడా లేదు. ఎందుకంటే అసలు వాడివాసల్ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. 2019 నుంచి సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, బందోబస్త్, ఎతుర్కుమ్ తునిందవన్, విక్రమ్ సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి కానీ వాడివాసల్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. ఈ గ్యాప్ లో వెట్రిమారన్ కూడా విడుదలై సినిమా చేసి తన మార్క్ మరోసారి ప్రూవ్ చేసాడు. ప్రస్తుతం సూర్య కంగువ సినిమా చేస్తున్నాడు, వెట్రిమారన్ విడుదలై పార్ట్ 2 చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక అయినా వెట్రిమారన్-సూర్య కలిసి వాడివాసల్ ని స్టార్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. సూర్య ఫ్యాన్స్ మాత్రం ఎప్పటిలాగే ఈరోజు కూడా వాడివాసల్ టైటిల్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.