Leading News Portal in Telugu

Guntur Kaaram : మహేష్ కు వాయిస్ ఓవర్ అందించనున్న పవన్..?


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం”.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పక్కా మాస్ అండ్ యాక్షన్ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు..కాగా ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం..దీనితో పవన్ కళ్యాణ్ అయితే కథ పరంగా ఇంట్రెస్టింగ్ వాయిస్ అందిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్ళగలడు అని దీనితో సినిమాకు ఎంతో ప్లస్ అవుతుంది అని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం . ఇలా చేస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా గుంటూరు కారం సినిమాపై ఎంతో ఇంట్రస్ట్ పెరుగుతుంది. దీంతో పవన్ తో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పించారని సమాచారం.. గతంలో జల్సా సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు మహేష్ వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. మహేష్ వాయిస్ జల్సా సినిమా కు ఎంతో ప్లస్ అయింది.మరి ఇప్పుడు పవన్ వాయిస్ ఓవర్ గుంటూరు కారం సినిమాకు హైప్ తీసుకువస్తుందో లేదో చూడాలి.