Leading News Portal in Telugu

Sujana Chaudhary: నా భూమి – నా దేశం నేల తల్లికి నమస్కారం..


ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వీరులపాడు మండలం పొన్నవరం సొంత గ్రామానికి విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి “నా భూమి -నా దేశం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ..”నా భూమి – నా దేశం” నేల తల్లికి నమస్కారం.. వీరులకు వందనం అనే ప్రత్యేక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో చేపట్టారని ఆయన సూచించారు.

దేశ సంక్షేమం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్థానిక మహనీయులు, సాహసవంతులు, వీరులను స్మరించుకోవాల్సి ఉందని మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. పుట్టుకతో ఈ నేలపై బంధం పెంచుకున్న మనం దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలని ఆయన చెప్పుకొచ్చారు. “నా భూమి- నా దేశం” కేవలం ఒక  కార్యక్రమం కాదు దేశ భవిష్యత్తుతో ప్రజలు తాము అనుసంధానం చేసుకునే సాధనమని మాజీ మంత్రి సుజనా చౌదర్ తెలిపారు.

దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని ప్రజలకు కార్యక్రమం అందిస్తుందని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. 25 ఏళ్ల తర్వాత ప్రస్తుత తరం గొప్ప భారతదేశానికి నాయకత్వం వహిస్తే.. ముందు తరం వారి మనస్సులో సంతృప్తి కలుగుతుందని అందరితో సుజనా చౌదరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం కేవలం బీజేపీ కోసం కాదు.. ప్రతి ఒక్కరు దీనిలో భాగం కావాలి అని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల మన దేశం యొక్క గొప్పతనం వెలుగులోకి వస్తుందన్నారు.