నిధి అగర్వాల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ చైతన్య హీరోగా `సవ్యసాచి` చిత్రంతో ఈ భామ హీరోయిన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతోపాటు `మిస్టర్ మజ్ను` చిత్రంలో అఖిల్‌తో కూడా నటించింది. కానీ ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత ఎనర్జెటిక్ స్టార్ రామ్‌తో `ఇస్మార్ట్ శంకర్` సినిమా చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీగా బాగా పాపులర్ అయ్యింది.`ఇస్మార్ట్ శంకర్`సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఏకంగా పవన్ కళ్యాణ్ తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.నిధి అగర్వాల్ తాజాగా `సైమా కర్టన్ రైజర్ ‘వేడుకలో పాల్గొంది. త్వరలో దుబాయ్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ప్రతి ఏడాది సైమా అవార్డు వేడుకలను నిర్వహిస్తుంటారు. ఈ సారి దుబాయ్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది..
ఈ సందర్బంగా ఈ అవార్డు వేడుకకి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది.ఈ ఈవెంట్ లో నిధి అగర్వాల్ హాట్ గా కనిపించింది.. ఈ సందర్భంగా కెమెరాలకు పోజులివ్వగా ఆయా ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..చాలా కాలం తర్వాత ఈ బ్యూటీని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.ఇందులో నిధి అగర్వాల్‌తోపాటు మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి అలాగే రానా పాల్గొన్నారు… నిధి అగర్వాల్ మాట్లాడుతూ తనకు సినిమాల పరంగా వచ్చిన గ్యాప్ గురించి, అలాగే ఈ ఈవెంట్‌లో డాన్సు చేయడంపై కూడా ఆమె రియాక్ట్ అయ్యింది.సినిమాలకు గ్యాప్ రావడంపై స్పందిస్తూ నేను గ్యాప్ తీసుకోలేదని అదే వచ్చిందని `అలా వైకుంఠపురములో` అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌నే ఈ భామ రిపీట్ చేసింది. నటినటుల కెరీర్ లో కొన్ని సార్లు గ్యాప్ వస్తుందని కానీ వాళ్ళు ఇదివరకు లాగానే మళ్ళీ అలరిస్తారని ఆమె చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఐటెమ్ సాంగ్ లు చేయడంపై నిధి అగర్వాల్ స్పందించింది.డాన్స్ చేయడమనేది ఒక ఆర్ట్ దాన్ని ఐటెమ్ సాంగ్ అనే పేరుతో అస్సలు పిలవకూడదని చెప్పింది. డాన్సు ని ఎంతో ఇష్టంతో,ఎంతో ఫీల్‌తో చేస్తామని అది అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆమె చెప్పింది. ఇలాంటి ఈవెంట్లలో డాన్స్ చేయడం నాకు ఎంతో ఇష్టమని నిధి అగర్వాల్ తెలిపింది.