ఇండియన్ సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్‌కు అక్కర్లేదనుకున్న వాళ్లను ఆసియా కప్-2023 టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మను కాదని సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్ట్ చేయడం వెనుక మీ ఉద్దేశమేమిటో చెప్పలని తెలిపాడు. తిలక్ వర్మ వెస్టిండీస్ టూర్ లో టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 173 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్. ఇక దేశవాళీ వన్డేల్లోనూ తిలక్ రికార్డు మెరుగ్గానే ఉందని ఆకాశ్ చోప్రా తెలిపారు.
ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడిన తిలక్.. మొత్తం ఐదు సెంచరీలు, 5 అర్ధ శతకాల సాయంతో 101.64తో 1236 రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో ఎడమచేతి వాటం తిలక్ వర్మకు ఉన్న అదనపు అర్హతగా పేర్కొంటూ ఆసియా వన్డే కప్ టోర్నీకి అతడిని ఎంపిక చేసినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటి ఇచ్చారు. అయితే, ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కలేదు.. అదే విధంగా.. నేపాల్‌తో నేడు (సోమవారం) జరుగుతున్న మ్యాచ్‌లోనూ అతడ్ని ఆడించే పరిస్థితి లేదు.. మరోవైపు.. వరల్డ్‌కప్-2023కి ఇదే ప్రొవిజినల్ జట్టు అని బీసీసీఐ.. 15 మంది సభ్యుల టీమ్ నుంచి తిలక్ వర్మతో పాటు యువ పేసర్ ప్రసిద్ కృష్ణను తప్పించినట్లు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ రికార్డు కూడా ఏమాత్రం బాగోలేదు.. అందుకే ఆసియా కప్ జట్టులో తిలక్ వర్మకు చోటిచ్చారు అని ఆకాశ్ చోప్రా అన్నారు. టీమ్ లోకి తిలక్ ను ఎందుకు సెలక్ట్ చేశారు? పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడించలేదు.. నేపాల్‌తో ఆడే జట్టులోనూ అతడికి చోటు దక్కకపోవడం దారుణమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తిలక్ వర్మకు వన్డే ప్రపంచకప్ ప్రొవిజినల్ జట్టులో స్థానం లేకపోతే.. ఆసియా కప్‌కు ఎంపిక చేసి ఉపయోగం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. శార్దూల్ ఠాకూర్‌ను నంబర్ 8 బ్యాటర్‌గా దింపే క్రమంలో ప్రసిద్ కృష్ణను కూడా జట్టులోకి తీసుకోలేదని ఆకాశ్ చోప్రా తెలిపాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.