పాలకుర్తిలో ఎక్కడ కూడా ప్రజలకు మట్టి అంటకుండ మంత్రి దయాకర్ రావు సీసీ రోడ్లు వేసాడని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళపాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొంతమంది డిక్లరేషన్ మీద నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను 3వ సారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని, ఇతరులు అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. కేసీఆఆర్ మూడోసారి గెలిస్తే అభివృద్ధి కొనసాగుతుందని, ఇతరులు గెలిస్తే అభివృద్ధికి కంటుపడుతుందని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల్లో వస్తున్న కరెంటు వేరే ప్రభుత్వం వస్తే కరెంట్ వచ్చే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. 75 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని, రైతు రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు ఉద్ఘాటించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హైట్రిక్ మాత్రం బీఆర్ఎస్ దే, కేసీఆర్ దే అని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఎన్ని జమిలీలు తెచ్చిన జంబ్లింగ్ లు చేసిన బీఆర్ఎస్ విజయం మాత్రం ఖాయమని, దక్షిణభారతంపై బీజేపీ చూస్తున్న చిన్న చూపుకు ఈ ప్రాంత ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో, దేశంలో కూడా కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.