నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలకు దత్తపుత్రుడు అని కార్టూన్ బొమ్మతో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఫ్లెక్సీని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుజనసేన నేతలు విజ్ఞప్తి చేశారు..
జనసేన నేతల విజ్ఞప్తికి మున్సిపల్ కమిషనర్ స్పందిచకపోవటంతో జనసేన ఆధ్వర్యంలో అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పాపం పసివాడు.. సీబీఐ దత్తపుత్రుడు.. 420 కాదని నిరూపించగలరా అనే ఫ్లెక్సీని జనసేన నాయకులు ఏర్పాటు చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనతో కావలి బ్రిడ్జి సెంటర్ లో భారీగా పోలీసుల మొహారించారు.
దీనిపై జనసేన నేతలకు వైసీపీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. ఆ ఫ్లెక్సీ తీయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. దీనికి జనసేన నేతలు స్పందిస్తున్నా.. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని వారు తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ చేసిన ఫ్లెక్సీని తొలగిస్తే.. వైసీపీ ఫ్లెక్సీని కూడా తొలగిస్తామని జనసైని సైనికులు చెప్పుకొచ్చారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన వారి మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కావాలి బ్రిడ్జి దగ్గర ఎలాంటి గొడవలు జరుగకూండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ ను రంగంలోకి దించింది. ఇరు పార్టీలకు చెందిన వారిని పోలీసులు నచ్చజెప్పుతున్నారు.