Leading News Portal in Telugu

Tamilnadu : ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి..


తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో తమిళనాడు ప్రముఖ సంగీత దర్శకుడు దశి అలియాజ్ శివకుమార్(50) అక్కడికక్కడే మృతి చెందారు. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ప్రమాదం జరిగిన చోట స్థానికులు చెబుతున్నారు.. ఈయన తమిళం, మలయాళీ భాషల్లో భాషల్లో అనేక చిత్రాలకు సంగీతం అందించారు..

వివరాల్లోకి వెళితే.. శివకుమార్ తన స్నేహితులతో కలిసి తన స్నేహితులతో కలసి కేరళ నుంచి చెన్నైకి కారులో వస్తుండగా ఈ ఊహకందని ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమికంగా పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. శివకుమార్ సొంత ఊరు సాలిగ్రామం. తన స్నేహితులు ఆడియన్, రియల్టర్ నాగరాజు, పుదుప్పెట్ కి చెందిన దర్శకుడు మూవేందన్ అంతా కలసి చెన్నైకి కారులో బయలుదేరారు.. తిరువూరు జిల్లా అవినాశి టౌన్ సమీపంలోకి రాగానే కారు ముందు టైర్ అకస్మాత్తుగా పేలింది. దీనితో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ని ఢీ కొట్టి పల్టీలు కొట్టింది…

ఈ ప్రమాదంలో శివకుమార్ స్పాట్ లోనే చనిపోగా, మరో వ్యక్తి కూడా చనిపోయారు.. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. ఎన్నో వందల సినిమాలకు ఈయన పనిచేసారు.. ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నారు.. ఇప్పుడు శివకుమార్ ఇలా ఘోర ప్రమాదంలో మరణించడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకున్నారు.. ఈ వార్తతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఆయన ఆత్మకు చేకూరాలని కోరుకుంటున్నారు..