గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంలోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ లో ముగ్గురు దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంక్ లోకి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. బ్యాంక్ లోకి ముగ్గురు దొంగలు వెళ్తుండగా పోలీస్ పెట్రోలింగ్ సైరన్ మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సంఘటన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు.
మంగళగిరి నగరంలోని HDFC బ్యాంకులో చోరికి దొంగలు యత్నించారు. ఈరోజు ( సోమవారం ) తెల్లవారుజాము 3 గంటల 40 నిమిషాల సమయంలో ముగ్గురు దొంగలు బ్యాంకు షట్టర్ తాళం పగలగొట్టి బ్యాంకు లోపలకు ప్రవేశించారు. అదే సమయంలో పోలీస్ బీట్ లో ఉన్న పెట్రోలింగ్ వాహనం సైరన్ వినబడటంతో భయంతో దొంగలు పారిపోయారు. చోరీ చేసేందుకు ప్రయత్నానికి సంబందించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
అయితే, ఈ ఘటనపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి దొంగల బెడద చాలా ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. దొంగలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచి ఉందని వారు తెలిపారు. సీసీ పుటేజీ పరిశీలించి దొంగలను గుర్తిస్తామని పోలీసులు పేర్కొన్నారు.