Leading News Portal in Telugu

Courier Fraud : కొరియర్ పేరిట రూ.29లక్షలు టోకరా


కొరియర్ పేరిట ఓ వ్యాపారికి 29లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి ఫిడేక్స్ కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నామని… మీ పేరుపై నిషేధిత ప్రొడక్ట్ తైవాన్ కు కొరియర్ బుక్ అయినట్టు నమ్మబలికారు. ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చామని… బాధిత వ్యాపారికి తెలిపారు. వెంటనే కస్టమ్స్ అధికారుల పేరుతో వ్యాపారికి మరో ఫోన్ కాల్ చేసి… నిషేధిత ప్రొడక్ట్ వేరే దేశాలకు పంపించడం నేరమని… కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

అయితే కేసు లేకుండా ఉండాలంటే తమకు 29లక్షలు చెల్లించాలని సూచించారు. కేసు నమోదు అవుతుందన్న భయంతో బాధిత వ్యాపారి సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కు 29లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అంతటితో ఆగకుండా మరికొంత డబ్బు పంపించాలని ఒత్తిడి చేయడంతో… బాధిత వ్యాపారి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపారు.