Leading News Portal in Telugu

OG: ఓవర్సీస్ టార్గెట్ ని ఫస్ట్ వీక్ కే బీట్ చేస్తాడు ఓజస్ గంభీర…


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కి OG ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనౌన్స్మెంట్ నుంచే పంజా వైబ్స్ ఇస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ షేప్ షకల్ మారిపోవడం గ్యారెంటీ. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నెలని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న OG గురించి లేటెస్ట్ ఇంఫార్మేషన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

OG ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లకి సేల్ అయ్యాయి… అంటే 13 కోట్లకి పైగా రాబడితే OG సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లే. OG సినిమా గ్లిమ్ప్స్ తో క్రియేట్ చేసిన హవోక్ చేస్తుంటే 13కోట్లని కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. పవన్ కళ్యాణ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజిత్ స్టైలిష్ మేకింగ్, థమన్ థంపింగ్ మ్యూజిక్… OG గ్లిమ్ప్స్ ని చూసిన వాళ్లకి గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ని సుజిత్ చూపించిన విధానానికి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా బయటకి వస్తే OG హైప్ ఆకాశాన్ని తాకుతుంది. అప్పుడు రెండు రోజుల్లోనే OG టార్గెట్ కంప్లీట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హ్యుజ్ ప్రీ బుకింగ్స్ తో ప్రీమియర్స్ కే OG వన్ మిలియన్ దాటడం గ్యారెంటీ.