Leading News Portal in Telugu

Allu Arjun : నా జీవితాంతం ఆయనకు రుణపడి వుంటాను..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ వస్తుంది అంటే ఊహించని స్థాయిలో అంచనాలు ఉంటాయి. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, అర్య2, పుష్ప ది రైజ్ వంటి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పుష్ప సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అలాగే ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా లభించింది.నేను సినిమాలలో ఇంతగా సక్సెస్ కావడానికి కారణం సుకుమార్ గారే అని. నా జీవితం మొత్తం ఆయనకు రుణపడి వుంటా అంటూ అల్లు అర్జున్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆర్య సినిమా సమయంలో నేను మరికొన్ని కథలు కూడా విన్నాను. అయితే ఆ సమయంలో సుకుమార్ గారి సినిమానే చేయాలనీ నేను ఫిక్స్ అయ్యానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆరోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈరోజు నేను ఈ స్థాయిలో సక్సెస్ కావడం సాధ్యమైందని అల్లు అర్జున్ కామెంట్లు చేశారు. ఆరోజు నేను వేరే నిర్ణయం కనుక తీసుకుని ఉంటే నటుడిగా ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని అల్లు అర్జున్ తెలిపారు.. నేను హీరోగా నిలదొక్కుకున్న తర్వాత నేను ఒక స్పోర్ట్స్ కారును కొనుగోలు చేయడానికి దాదాపు 85 లక్షల రూపాయలు ఖర్చు చేశానని అల్లు అర్జున్ తెలిపారు.. ఆ కారు స్టీరింగ్ పట్టుకున్న సమయంలో సుకుమార్ వల్లనే కదా నాకు ఈ కారును కొనుగోలు చేయడం సాధ్యమైంది అని అనిపించిందని అల్లు అర్జున్ తెలిపారు. ఈ రోజు నేను ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లడానికి కూడా సుకుమార్ గారే కారణం.గుండెల మీద చెయ్యి వేసుకుని నేను ఒకే ఒక్క మాట చెప్పగలను సుకుమార్ గారు లేకపోతే నేను లేను ఆయనకీ ఎప్పటికి రుణపడి వుంటా అని అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.