బిజినెస్ చెయ్యాలనే కోరిక అందరికి ఉంటుంది.. మనుషులకు అవసరమైన అన్నిటిని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు.. ఈ మధ్యకాలంలో జనాలకు మనుషులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది.. వాస్తు ప్రకారం అన్నీ ఉండాలని కోరుకుంటారు.. ఉద్యోగాలు, వ్యాపారాల్లో తమకు లాభాలు రావాలంటూ మంచి జరగాలని వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు.. వాస్తు ప్రకారమే అన్ని చెయ్యాలని పలువురికి హితబోద కూడా చేస్తున్నారు.. అయితే మీ ఉపాధిలో ఎక్కువ లాభం పొందాలనుకుంటే, ఈ వ్యాపార ఆలోచన మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటో ఒక లుక్ వేద్దాం పదండీ..
ఈ బిజినెస్ కు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను పొందోచ్చు.. బోన్సాయ్ ప్లాంట్స్ పెంపకం.. బోన్సాయ్ మొక్కలకు ఈ మధ్య కాలంలో చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇది చాలా లక్కీ ప్లంట్… మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ప్రజలు ఈ మొక్కను తమ ఇళ్లలో అదృష్టం కోసం… అలంకారం కోసం ఉంచుతారు.. కేవలం 20 వేల రూపాయలు ఉంటే చాలు లక్షల్లో లాభాలను పొందోచ్చు.. వివరాల్లోకి వెళితే..మార్కెట్లలో ఈ మొక్క ధర రూ.300 నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. బీహార్ బోన్సాయ్ ఆర్ట్ పేరుతో ఈ వ్యాపారాన్ని ఓ వ్యక్తి ప్రారంభించాడు. ఈరోజు ఆయన బోన్సాయ్ మొక్క దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళుతుంది. వీరి దగ్గర 20-25 ఏళ్ల బోన్సాయ్ మొక్క కూడా అందుబాటులో ఉంది..
ఎన్ని ఏళ్లు గడిచిన ఈ మొక్క పెరగదు అందుకే ఎక్కువగా అలంకరణకు వాడుతారు..మొక్కలకు అందమైన ఆకారాన్ని ఇవ్వడం, నీటిపారుదల నిర్దిష్ట పద్ధతి , వాటిని ఒక కుండ నుండి మరొక కుండకు మార్పిడి చేసే పద్ధతి ఉన్నాయి. బోన్సాయ్ మొక్కలను కుండలలో వాటి సహజ రూపం ఉండే విధంగా పెంచుతారు, కానీ అవి పరిమాణంలో మరగుజ్జుగా ఉంటాయి. బోన్సాయ్‌లను ఇంట్లో ఎక్కడైనా ఉంచవచ్చు. అన్నింటిలో మొదటిది, బోన్సాయ్లకు తగిన మొక్కను ఒక కుండలో పెంచుతారు. అప్పుడు దాని బయటి భాగం కావలసిన శైలి ప్రకారం ముందుగా నిర్ణయించిన విధంగా కత్తిరించి ఆకృతిని ఇస్తే సరిపోతుంది.. మొక్కల పెంపకం ఆసక్తి ఉన్న వాళ్లు ఈ మొక్కలను పెంచవచ్చు.. చూడండి మరి..