Leading News Portal in Telugu

India Squad for CWC23: ఇట్స్ ఆఫీషియల్.. ప్రపంచకప్‌ 2023లో ఆడే భారత జట్టు ఇదే! తెలుగోడికి షాక్


BCCI Announce India Team for World Cup 2023: భారత్ గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసింది. ఈ జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కాగా.. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేస్ దళాన్ని నడిపించనున్నాడు.

ఆసియా కప్‌ 2023తో పునరాగమనం చేసిన స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌లకు ప్రపంచకప్‌ 2023 జట్టులో చోటు దక్కింది. వన్డేల్లో పెద్దగా రికార్డ్స్ లేని మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండర్ కోటాలో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఎంపిక కాగా.. యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ, కీపర్‌ సంజు శాంసన్‌, పేసర్ ప్రసిధ్ కృష్ణలకు ప్రపంచకప్‌ జట్టులో అవకాశం దక్కలేదు.

ప్రపంచకప్‌ 2023కు భారత జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌.