Leading News Portal in Telugu

Rain Alert: రానున్న మూడు రోజుల్లో వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ కీలక ఆదేశాలు


రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపినందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతున్నందున ఏవిధమైHarish Rao : వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి..న ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం నాడు జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సీఎస్ సమీక్షించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, ఆయా చెరువులకు గండ్లు పడడం, తెగిపోకుండా ఉండేందుకు తగు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

ఉదృతంగా ప్రవహించే కాజ్-వే లు, కల్వర్టులు, వంతెనలవద్ద ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకుగాను సంబంధిత మండల స్థాయి రెవెన్యూ, పిఆర్ తదితర అధికారులతో రెగ్యులర్ టెలి-కాన్ఫరెన్స్‌ ల ద్వారా సమీక్షించాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలని, వర్షాలు, వరద ప్రాభావిత ప్రాంతాల్లో తగు సహాయ కార్యక్రమాలకి స్థానిక అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని కోరారు. వర్ష, వరద ప్రాభావిత ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించి వరద బాధిత కుటుంబాలకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, బాధితులకు ఆహారం, మంచినీరు, వైద్య తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల్లో తగు ముందస్తూ ఏర్పాట్లను చేయడంతోపాటు, మ్యాన్-హొళ్ళ పై కప్పులు తెరువకుండా నగర వాసులను చైతన్య పర్చాలని ఆదేశాలు జారీ చేశారు.