సింగరేణి వేతన బకాయిలు 23 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కోల్ ఇండియా ఇప్పటికే ఐదుకు సంబంధించిన జీవో కూడా ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. 2200 కోట్ల లాభంలో కార్మికుల వాటా 750 కోట్లు వారికీ రావాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని తన ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలని చూస్తుందని ఆయన మండిపడ్డారు. జెన్‌కో, ట్రాన్స్ కో నుంచి సింగరేణికి 20 వేల కోట్లు బకాయి ఉందని, తెలంగాణ ఏర్పడినపుడు 3540 బ్యాంకు బాండ్స్ తో లాభల్లో ఉండగా ఇప్పుడు బకాయిలు రాక కష్టాల్లో ఉందని ఆయన వెల్లడించారు. అప్పుడు 65 వేల కార్మికులు ఉంటే ఇప్పుడు 42 వేలకు పడిపోయిందని, కారణం బొగ్గు తవ్వే పని కాంట్రాక్టు ఇవ్వటంతో కార్మికులు సంఖ్య తగ్గిందని ఆయన అన్నారు.
కేంద్రంతో ఉమ్మడిగా పధకం పన్ని కార్మికుల శ్రమని వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. 33 జిల్లాలో ప్రభుత్వ ఖర్చుతో మెడికల్ కాలేజీ అన్న ప్రభుత్వం రామగుండంలో మాత్రం సింగరేణి నుంచి ఫండ్ తీసుకుంటుందని ఆయన విమర్శించారు. సింగరేణి కార్మికుల పిల్లలకి మెడికల్ కాలేజీ లో కనీసం 25 శాతం వాట ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే కేవలం 7 శాతం ఇస్తామనటం ఏంటని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో సింగరేణికి 400 కోట్లు కేటాయించి లాభాలా బాట పట్టేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్ కోసం 3 రోజుల క్రితమే అప్లై చేసి పరేడ్ గ్రౌండ్ ని కూడా చూసి వచ్చారన్నారు. ఇప్పుడు బీజేపీ అదే రోజు అక్కడే హైదరాబాద్ విమోచన దినం చేస్తామనం ఏంటని, వాళ్ళకి అది తప్ప వేరే గ్రౌండ్ దొరకలేదా అని ఆయన ప్రశ్నించారు. ఫస్ట్ కాంగ్రెస్ అనుమతి కోరింది కాబట్టి మాక్ అనుమతి ఇవ్వాలని, బీజేపీ ఇలాంటి కుంచిత తాత్వాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు.