Prabhas- Anushka:లేడీ సూపర్ స్టార్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది. ఇక ఈ చిత్రంలో జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నవీన్ పోలిశెట్టి తన భుజస్కందాలపై వేసుకొని మోస్తున్నాడు. అనుష్క ప్రమోషన్స్ కి రాను అని చెప్పడంతో అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు. కాకపోతే అనుష్క ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వనుందని ముందు నుంచే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ఇంటర్వ్యూ షూట్ జరిగిందని తెలుస్తుంది. ఇక ఇందులో ఆమె అనేక ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఆమె పెళ్లి గురించి, సినిమాల గురించి, ప్రభాస్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఇక ప్రభాస్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అన్న ప్రశ్నకు ఆమె స్పందించింది.”మంచి కథ దొరికితే వెంటనే చేస్తాను” అని అనుష్క చెప్పుకొచ్చేసింది. దీంతో అభిమానులు ఆకాశంలో తేలిపోతున్నారు. వీరిద్దరి కాంబో మళ్లీ రీపీట్ అవ్వాలని ఎన్నో రోజులుగా కోరుకుంటున్నాం.. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరేలా ఉందని కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరిని కలిపి సినిమా తీసే ఆ డైరెక్టర్ ఎవరు అయితే బాగుంటుంది అని అప్పుడే ఆలోచనలు కూడా మొదలుపెట్టేశారు కొంతమంది రాజమౌళి అంటుండగా ఇంకొంతమంది శివా కొరటాల అంటూ చెప్పుకొస్తున్నారు ఇక ఇప్పటికే అనుష్క ప్రభాస్ కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో నటించారు అప్పటినుంచి కూడా వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని త్వరలోనే మీరు పెళ్లి చేసుకుంటే బాగుండు అని అభిమానులు కోరుకుంటూ వస్తున్నారు పెళ్లి గురించి పక్కన పెడితే వీరిద్దరూ కలిసి సినిమా తీయాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి ఆశను నెరవేర్చి దర్శకుడు ఎవరు ఉంటారో చూడాలి